అబ్ధుల్లాపూర్ మెట్ మర్డర్ కేసులో.. ప్రియురాలి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్‌ను మర్డర్ చేసిన నిందితుడు.. ఫోటోలు తీసి ప్రియురాలికి మేసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫోటోలు చూసిన అమ్మాయి వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. నవీన్ హత్య కేసుతో ప్రియురాలికి కూడా సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కూడా విచారణకు పిలిచే అవకాశముంది. మరోవైపు నవీన్ హత్యకు మూడు నెలలుగా ప్లాన్ చేసిన నిందితుడు.. అందుకోసం యూట్యూబ్ వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. హత్యకు రెండు నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఇదిలా ఉంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని నవీన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణ ఒక్కడే ఈ హత్య చేసి ఉండడని.. ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే దానిపై విచారణ జరపాలని పోలీసులను కోరారు. నిందితులను వదిలి పెట్టొద్దని.. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.