- నేటి నుంచి తొలి అనధికారిక టెస్టు
మకే (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియాతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పోటీపడే ఇండియా టెస్టు టీమ్‌కు ఎంపికైన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ ముందుగా ఆస్ట్రేలియా–ఎ బౌలర్లతో సవాల్‌కు సిద్ధమయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని ఇండియా–ఎ, ఆసీస్–ఎ జట్ల మధ్య గురువారం మొదలయ్యే తొలి అనధికారిక టెస్టు (నాలుగు రోజులు) మ్యాచ్‌లో ఈ ఇద్దరితో పాటు పేసర్ ప్రసిధ్ కృష్ణపై ఫోకస్ ఉండనుంది.
ఈ మ్యాచ్‌లో సత్తా చాటితే నవంబర్ 22 నుంచి జరిగే బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో వీళ్లు ఇండియా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈశ్వరన్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్‌కు బ్యాకప్‌గా ఉండనున్నాడు. పాండ్యా మాదిరిగా నితీశ్ రెడ్డిని పేస్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.