క్రికెట్ చరిత్రలోనే భారీ నో బాల్‌: టీమిండియా మాజీ బౌలర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

క్రికెట్ చరిత్రలోనే భారీ నో బాల్‌: టీమిండియా మాజీ బౌలర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

క్రికెట్ లో నో బాల్స్ వేయడం సహజం. ఒక ఓవర్లో రెండు సార్లు నో బాల్ వేసినా పెద్దగా పట్టించుకోరు గాని బౌలింగ్ వేస్తున్నప్పుడూ భారీగా లైన్ ధాటి వస్తే మాత్రం అనుమానాలు వ్యక్తమవుతాయి. తాజాగా అలాంటి సంఘటన అబుదాబి T10 లీగ్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ నార్తర్న్ వారియర్స్ తరపున ఆడుతున్నాడు. శనివారం (డిసెంబర్ 2) చెన్నై బ్రేవ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మిథున్ వేసిన భారీ నో బాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 
  
ఈ మ్యాచ్ లో చెన్నై బ్రేవ్స్‌ ఛేజింగ్ చేస్తున్న సమయంలో మిథున్ 5 వ ఓవర్లో బౌలింగ్ కి వచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతికి భానుక రాజపక్స వికెట్ తీసుకున్న ఈ భారత మాజీ ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత మూడు బంతికి ఒక అద్భుతమైన బంతికి అసలంకను అవుట్ చేసాడు. రిప్లేలో చెక్ చేస్తే  ఇది నో బాల్ గా తేలింది. అయితే మిథున్ వేసిన ఈ బాల్ 2 గజాలు దాటింది. క్రికెట్ లో ఇదే భారీ నో బాల్ గా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలో పాక్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఇంగ్లాండ్ పై 2010లో జరిగిన లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్ చేసి భారీ నో బాల్ వేసాడు. ప్రస్తుతం మిథున్ వేసిన నో బాల్ దీనికి గుర్తు చేస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో నార్తర్న్ వారియర్స్  జట్టు ఓడిపోయింది. 107 పరుగుల ఛేజింగ్ లో సికందర్ రజా 10 బంతుల్లో 27 పరుగులు చేసి  చెన్నై బ్రేవ్స్‌ ను గెలిపించాడు.