మూడు రోజుల టెన్షన్..మిగిల్చిందేమిటి?

మూడు రోజుల టెన్షన్..మిగిల్చిందేమిటి?

దక్షిణాసియా మూడు రోజులుగా ఒకటే టెన్షన్‌‌తో గడిపింది. చివరకు పాక్‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ ‘శాంతి సూచన’గా తమ దగ్గరున్న ఇండియన్‌‌ వింగ్‌‌ కమాండర్‌‌ అభినందన్‌‌ని వదిలిపెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో సౌత్‌‌ ఆసియా ఊపిరి పీల్చుకుంది. ఘర్షణ సద్దుమణిగి న ఫీల్‌‌ కలిగింది. రెండు అణ్వస్ త్ర దేశాల మధ్య మొదలైన దాడులు, ప్రతీకార దాడులు ఎక్కడకు దారి తీస్తాయోనన్న భయం మాత్రం అలాగే ఉండి పోయింది. ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ పాక్‌‌ పార్లమెంట్‌‌లో చేసిన ప్రకటన, ఆ తర్వా త శుక్రవారం సాయంత్రానికి అభినందన్‌‌ వర్థమాన్‌‌ని వాఘా సరిహద్దులో ఇండి యన్‌‌ ఆర్మీకి అప్పగించడం వంటివి నిజంగానే శాంతి సూచనగా భావించాలా వద్దా అనే సందేహం కూడా మిగిలింది. పుల్వా మా ఎటాక్ తో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఆ దాడికి ప్రతీకారంగా ఇండియన్‌‌ ఎయిర్‌‌ఫోర్స్‌‌ పాక్‌‌ భూభాగంలోని మిలిటెంట్ల శిబిరంపై దాడికి దిగింది. ‘ఇది మిలిటరీ ప్రతీకార చర్య కాదు. ముందరి కాళ్లకు బంధంగా చేసిన ‘నాన్‌‌–మిలటరీ ప్రి–ఎంటివ్‌ ’గా ఇండియా చెప్పుకొచ్చింది. ఆ మర్నాడే పాక్‌‌ ఎయిర్‌‌ఫోర్స్‌‌ కాశ్మీర్‌‌ భూభాగంలో కి చొచ్చుకొచ్చి ఇండి యన్‌‌ సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించడం, దానిని తిప్పికొట్టే ప్రయత్నంలో వింగ్‌‌ కమాండర్‌‌ అభినందన్‌‌ ఎల్‌‌ఓసీని దాటడం, అతను వెళ్తున్న మిగ్‌‌ విమానం కూలిపోగా, పారాచ్యూట్‌‌ ద్వారా నేలకు దిగడం, అతడిని పాక్‌‌ సైన్యం తమ స్వాధీనంలోకి తీసుకోవడం చక చకా జరిగిపోయాయి. అభినందన్‌‌ అప్పగింత విషయంలో పాకిస్థాన్‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ ఏకపక్షంగా తీసుకున్న చొరవ విషయంలో మాత్రం కొన్ని సందేహాలు అలాగే ఉన్నాయి. ఇమ్రాన్‌‌ నిర్ణయంవల్ల జమ్మూ–కాశ్మీర్‌‌లో నూ, నియంత్ర ణాధికార రేఖ (ఎల్‌‌ఓసి)వద్ద శాంతికి మార్గమేర్పడుతుందా అన్నది మొదటి సందేహం. ప్రస్తుతానికైతే ఘర్షణ వాతావరణం చల్లబడింది. కానీ, పుల్వా మా దాడిలో ఇండియన్‌‌ ఇంటెలిజెన్స్‌‌ వైఫల్యం, సైనిక కార్యాచరణలో లోపాలు బయటపడ్డాయి. పుల్వా మా దాడిలో భారీగా ప్రాణనష్టం జరిగింది. దీనికి కారణమేమిటన్న అన్వే షణ సాగాల్సి ఉంటుంది.

 రెండో సందేహం… బాలాకోట్‌‌లో నూ, గగన తలంలో నూ వాస్తవానికి ఏం జరిగి ఉంటుంది?

ఇండియా, పాకిస్థాన్‌‌ దేశాల మధ్య ఇప్పటివరకు చర్చల ప్రక్రియ మొదలు కాలేదు. అంటే, ఈ రెం డూ ఇప్పటికీ ఎడమొకం, పెడమొకంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండి యన్‌‌ ఎయిర్‌‌ఫోర్స్‌‌ బాలాకోట్‌‌లో జరిగిందేమిటన్న వివరం వెల్లడి కావాలి. ఐఏఎఫ్‌‌కి చెందిన 12 మిరేజ్‌‌–2000 జెట్‌‌ ఫైటర్లు మిలిటెం ట్ల స్థావరాలపై దండెత్తి, 1,000 కిలోల బాంబులు జారవిడవడంతో టెర్రిస్టుల బేస్‌‌ మొత్తం ధ్వంసం అయిందని, 300 మంది వరకు హతమయ్యారని ఆర్మీ ప్రకటించింది. దీని వివరాలెక్కడ? అలాగే, పాక్‌‌ జెట్‌‌ విమానాలు ఎల్‌‌ఓసిని దాటి మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి, ఒక ఇండి యన్‌‌ యుద్ధ విమానాన్ని కూల్చడంపైకూడా జనాలకు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్‌‌ విమానాన్ని కూల్చేశా మని ఇండియా చెబుతోంది. మరి, బుధవారం బుద్గాంలో ఒక మిగ్‌‌–17 కూలిపోవడంతో ఏడుగురు చనిపోయారు. ఇది సాంకేతిక లోపంతో జరిగినట్లుగా చెబుతున్నారు గానీ, దీని వివరాలేవీ తెలియడం లేదు. మూడో సందేహం… పాకిస్థాన్‌‌ వైఖరిని ఇండియా మార్చగలిగిందా అనేది. మన ఉద్దేశం పాక్‌‌పై దండెత్తడం కాదన్నది సుస్పష్టం . పాక్‌‌ భూభాగంద్వా రా ఇండియాకి వ్యతిరేకంగా జరుగుతున్న మిలిటెంట్‌‌ కార్యకలాపాల్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడమే ప్రధానం. ఇది నిజానికి జగమెరిగిన సత్యం. అయినప్పటికీ పాక్‌‌ని కవ్విం చకుండా దశాబ్దాలపాటు ఇండియా ఓపిగ్గా చూసింది. మోడీ సర్కారు ఏర్పడ్డాక దెబ్బకు దెబ్బ అన్నట్లుగా పరిస్థితి మారింది. 2016లో మొదటిసారి సర్జికల్‌‌ స్ట్రయిక్స్‌‌ జరిపింది.

ఆ తర్వా త బాలాకోట్‌‌లో జరిపినది రెండో దాడి. తాజా ఘర్షణలతో పాక్‌‌ ఎదురుదాడికి దిగడాన్ని బట్టి ఇండియా ఉద్దేశం నెరవేరుతుందా అన్నది సందేహం.