ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం (Abhinav Gomatam) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మై డియర్ దొంగ (My Dear Donga). సర్వజ్ఞ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న మై డియర్ దొంగలో అభినవ్ గోమటంకి జోడీగా శాలిని కొండెపూడి (Shalini Kondepudi) హీరోయిన్గా నటించింది.
తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ని అనౌన్స్ చేసింది ఆహా. ."ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి..ఎందుకంటే అసలైన దొంగ ఏప్రిల్ 19న వస్తున్నాడు” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది.ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శాలిని కొండెపూడి రైటర్‌గా వ్యవహరించింది.
ఇప్పటివరకు ప్రేక్షకులు అడవి దొంగ విన్నారు.టక్కరి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియర్ దొంగ ఎవరో తెలియాలంటే..త్వరలో ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న..మై డియర్ దొంగ సినిమా చూడాల్సిందే అంటూ ట్యాగ్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులు అభినవ్ గోమటం చేసే సరదా సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అర్ధం చేసుకుంటున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించాడు. అజయ్ అరసాడా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని..డైరెక్ట్‌గా ఆహా ఒరిజినల్(Aha Original) మై డియర్ దొంగను రూపొందించినట్లు సమాచారం.
అభినవ్ గోమటం సినిమాలు చూసుకుంటే..
2014లో వచ్చిన మైనే ప్యార్ కియా మూవీతో ఎంట్రీ ఇచ్చిన..2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.అలాగే తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం హిలేరియస్‌గా అతడి క్యారెక్టర్ నవ్వించింది. అలాగే ఈ మధ్య కాలంలో అభినవ్ సినిమాలు చూసుకుంటే..మీకు మాత్రమే చెప్తా, శ్యామ్ సింగరాయ్‌తో, విరూపాక్ష తో పాటు పలు సినిమాలు చేశాడు. ఇక రీసెంట్ గా ఓటీటీ లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.
ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి...🧐
— ahavideoin (@ahavideoIN) April 4, 2024
ఎందుకంటే అసలైన దొంగ April 19thన వస్తున్నాడు!🦹🏻 #MyDearDongaOnAha #AnAhaOriginalFilm #camentertainment @AbhinavGomatam #shalinikondepudi #divyasripada #nikhilgajula #sashaankmanduri @sprite_india pic.twitter.com/x2kARiIJnD