My Dear Donga Trailer: అమ్మ బాబోయ్..దొంగోడు! మీ నవ్వులు దోచేందుకు ట్రైలర్తో వచ్చాడు

ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేమ్ అభిన‌వ్ గోమటం (Abhinav Gomatam) హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మై డియ‌ర్ దొంగ (My Dear Donga). స‌ర్వ‌జ్ఞ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న మై డియ‌ర్ దొంగలో అభిన‌వ్ గోమ‌టంకి జోడీగా శాలిని కొండెపూడి (Shalini Kondepudi) హీరోయిన్గా నటించింది.ఈ మూవీ రేపటి నుంచి (ఏప్రిల్ 19న)స్ట్రీమింగ్ కానుంది. 

తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇంట్లోకి వచ్చిన దొంగ దొంగతనం చేస్తూ ఓ అమ్మాయికి దొరికితే వాడి కష్టాలు చెప్పి ఆ అమ్మాయికి ఫ్రెండ్గా ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది సరికొత్త కాన్సెప్ట్తో..ఫన్నీగా ఉండబోతున్నట్టు చూపించారు.మై డియర్ దొంగ సినిమా మొత్తం అభినవ్ కామెడితో కడుపుబ్బా నవ్వించబోతున్నాడని ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతోంది.అమ్మ బాబోయ్..దొంగోడు!మీ నవ్వులు దోచేందుకు 'ట్రైలర్' తో వచ్చాడు అనే ట్యాగ్తో రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది 

ఇప్పటివరకు ప్రేక్షకులు అడ‌వి దొంగ విన్నారు.ట‌క్క‌రి దొంగ విన్నారు.జేబు దొంగ విన్నారు.కానీ మై డియ‌ర్ దొంగ ఎవ‌రో తెలియాలంటే..రేపు ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న..మై డియ‌ర్ దొంగ సినిమా చూడాల్సిందే అంటూ ట్యాగ్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులు అభినవ్ గోమటం చేసే సరదా సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో చూసి ఎంజాయ్ చేయండి. 

అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాను మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిర్మించాడు.అజ‌య్ అర‌సాడా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని..డైరెక్ట్‌గా ఆహా ఒరిజిన‌ల్(Aha Original) మై డియ‌ర్ దొంగ‌ను రూపొందించిన‌ట్లు స‌మాచారం.

అభినవ్ గోమటం సినిమాలు చూసుకుంటే..

2014లో వచ్చిన మైనే ప్యార్ కియా మూవీతో ఎంట్రీ ఇచ్చిన..2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.అలాగే త‌న కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ను ఆక‌ట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం హిలేరియ‌స్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ న‌వ్వించింది. అలాగే ఈ మధ్య కాలంలో అభినవ్ సినిమాలు చూసుకుంటే..మీకు మాత్ర‌మే చెప్తా,శ్యామ్ సింగ‌రాయ్‌తో,విరూపాక్షతో పాటు ప‌లు సినిమాలు చేశాడు.ఇక రీసెంట్గా ఓటీటీలో వచ్చిన సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.