Abhinav Manohar: రూ.3 కోట్లు పెట్టి కొంటే ముంచేస్తున్నాడు.. తేలిపోతున్న సన్ రైజర్స్ హిట్టర్

Abhinav Manohar: రూ.3 కోట్లు పెట్టి కొంటే ముంచేస్తున్నాడు.. తేలిపోతున్న సన్ రైజర్స్ హిట్టర్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభినవ్ మనోహర్ చెత్త బ్యాటింగ్ తో అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. ఫినిషర్ గా పనికొస్తాడని జట్టులో పెట్టుకుంటే ఆ పాత్రకు కొంచెం కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. వరుసగా అవకాశాలు వచ్చినా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ సీజన్ 2025 లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో మనోహర్ ఘోరంగా ఫెయిలయ్యాడు. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై తొలి బంతికే ఔటయ్యాడు. 

లక్నోతో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆదివారం (మార్చి 30) ఢిల్లీ క్యాపిటల్స్ తో నాలుగు పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అభినవ్ షాట్ సెలక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రీజ్ లోకి రాగానే భారీ షాట్స్ కు ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో అభినవ్ మనోహర్ ను రూ. 3.4 కోట్ల ధరకు దక్కించుకుంది. జట్టులో ఫినిషర్ బాధ్యతలు అప్పగిస్తే బాధ్యత లేకుండా అనవసరంగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. 

మనోహర్ తదుపరి మ్యాచ్ కు తుది జట్టులో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. చివరి రెండు సీజన్ లలో గుజరాత్ టైటాన్స్ పై పర్వాలేదనిపించిన ఈ బెంగాల్ పవర్ హిట్టర్.. సన్ రైజర్స్ జట్టులో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. బెంగాల్ టీ20 మహారాజ ట్రోఫీలో మనోహర్ ఇరగదీశాడు. తన హిట్టింగ్ తో ఎన్నో అసాధ్యమనుకున్న మ్యాచ్ లు గెలిపించాడు. అభినవ్ ఫామ్ లోకి వస్తే సన్ రైజర్స్ కు ఫినిషింగ్ సమస్య తీరినట్టే. ఇప్పటివరకు సన్ రైజర్స్ మూడు మ్యాచ్ లు ఆడితే ఒకటి గెలిచి మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.