కాంగ్రెస్ నేతలకు సింఘ్వీ విందు

కాంగ్రెస్ నేతలకు సింఘ్వీ విందు

  హాజరైన సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ పార్టీ రాష్ట్ర నేతలకు విందు ఇచ్చారు. ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, పీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గురువారం బేగంపేట టూరిజం ప్లాజాలో అభిషేక్ మను సింఘ్వీని సన్మానించనున్నారు. అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్తారు.