
తన భార్య ఐశ్వర్య ఫోన్ చేస్తే టెన్షన్ పడతానని చెబుతున్నాడు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఇటీవల ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ (I want to talk) చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
తాజాగా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్ని ఆయన మాట్లాడుతూ.. దర్శకుడి వల్లే తాను తండ్రి పాత్రలో ఒదిగిపోయానని తెలిపారు. అనంతరం ఆయన తన భార్య ఐశ్వర్య రాయ్ గురించి పరోక్షంగా మాట్లాడారు. తోటి నటుడు, షో హోస్ట్ అర్జున్ కపూర్ తో సరదాగా సంభాషించారు. ఉత్తమ నటుడిగా నేను అందుకున్న తొలి అవార్డు ఇదే. ఈ అవార్డుకు నేను అర్హుడినని భావించిన కార్యక్రమం నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు.
దర్శకుడు సూజిత్ సర్కార్ వల్లే నేను ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేయగలిగాను. ఈ సినిమాలో నాకు కుమార్తెలుగా నటించిన ఆహిల్య, పెరల్ దీనిని పంచుకుంటా. తోటి నటీనటుల నుంచే ఎంతో స్ఫూర్తి పొందుతున్నా. ఆయా చిత్రాల్లో వారి నటన చూసి వారిలా నేను కూడా చేయాలని అనుకుంటూ ఉంటా. నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేందుకు వారు ఎంతగానో తోడ్పడుతున్నాడు" అని అభిషేక్ బచ్చన్ తెలిపారు.
ALSO READ | Niharika Konidela: షాకింగ్ ఫొటో షేర్ చేసిన మెగా డాటర్ నిహారిక.. పాదాలు ఏంటి ఇలా అయిపోయాయి?
అర్జున్ కపూర్ మాట్లాడుతూ. "నేను మీతో మాట్లాడాలి" అంటూ ఎవరు ఫోన్ చేస్తే వీరు కంగారు వస్తుంది?" అనగా.. అభిషేక్ నవ్వుతూ "నీకింకా పెళ్ళి కాలేదు. కాబట్టి ఇలా ప్రశ్నిస్తావు. ఒక్కసారి నీకు పెళ్లి అయితే ఈ ప్రశ్నకు నీ వద్ద కూడా ఒక సమాధానం ఉంటుంది. భార్య ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అంటే అసలైన గందరగోళానికి గురవుతావు. ఆ ఫోన్ కాల్స్ ఒత్తిడికి గురిచేస్తాయంటూ సరదగా ఐదులిచ్చారు.