
కోల్‌కతా: టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా వేటుకు గురైన అభిషేక్ నాయర్ ఐపీఎల్‌లో మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జట్టు కట్టాడు. నాయర్‌ను తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకున్నట్టు కేకేఆర్ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఐపీఎల్‌లో మిగిలిన భాగానికి నాయర్ కేకేఆర్ జట్టుతో పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
అయితే, అభిషేక్‌కు ఎలాంటి బాధ్యత అప్పగించిందనే విషయాన్ని చెప్పలేదు. నాయర్ 2024 సీజన్ వరకు కేకేఆర్ కోచింగ్ సిబ్బందిలో భాగంగా ఉన్నాడు. గత సీజన్‌లో అసిస్టెంట్ కోచ్ కమ్ మెంటార్‌గా పనిచేశాడు. కేకేఆర్ అకాడమీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాడు. నాయర్ తిరిగి అసిస్టెంట్ కోచ్‌గా చేరినట్టు కేకేఆర్ ట్వీట్ చేసినా.. వెంటనే దాన్ని తొలగించింది.