ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో.. 2వ ర్యాంక్ కు చేరుకున్న అభిషేక్‌ శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో.. 2వ ర్యాంక్ కు చేరుకున్న అభిషేక్‌ శర్మ

దుబాయ్‌‌‌‌: టీమిండియా ఓపెనర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ శర్మ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ ఒకేసారి 38 ప్లేస్‌‌‌‌లు ఎగబాకి రెండో ర్యాంక్‌‌‌‌కు దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 829 రేటింగ్‌‌‌‌ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌‌‌‌తో జరిగిన ఐదో టీ20లో 54 బాల్స్‌‌‌‌లోనే 135 రన్స్‌‌‌‌ చేయడం అభిషేక్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. 

హైదరాబాద్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ (803) ఒక్క స్థానం కిందకు దిగి మూడో ర్యాంక్‌‌‌‌లో నిలవగా, సూర్యకుమార్‌‌‌‌ (738) ఐదో ర్యాంక్‌‌‌‌లో ఉన్నాడు. ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (855), ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (798) వరుసగా ఒకటి, నాలుగో ర్యాంక్‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు. హార్దిక్‌‌‌‌ పాండ్యా (506), రింకూ సింగ్‌‌‌‌ (498), శివమ్‌‌‌‌ దూబే (484) వరుసగా 51, 55, 58వ ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌‌‌‌లో వరుణ్‌‌‌‌ చక్రవర్తి (705) మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. 

రవి బిష్ణోయ్‌‌‌‌ (671), అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (652), అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (636) వరుసగా 6, 9, 13వ ర్యాంక్‌‌‌‌లను సొంతం చేసుకున్నారు. టెస్ట్‌‌‌‌ల్లో యశస్వి జైస్వాల్‌‌‌‌ (847) నాలుగో ర్యాంక్‌‌‌‌లో ఉండగా, బౌలింగ్‌‌‌‌లో బుమ్రా (908) నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లోనే కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా (745) తొమ్మిదో ర్యాంక్‌‌‌‌ను సాధించాడు.