IND Vs PAK: భారత్- పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ,తిలక్ వర్మ

IND Vs PAK: భారత్- పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ,తిలక్ వర్మ

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే బుమ్రా హాజరు కాగా.. తాజాగా అభిషేక్ శర్మ,తిలక్ వర్మ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సందడి చేస్తూ కనిపించారు. తిలక్ వర్మ జుట్టు పెంచి స్టయిలిష్ లుక్ లో కనిపించాడు. మరోవైపు అభిషేక్ శర్మ కలర్ ఫుల్ షర్ట్ లో అదిరిపోయాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుబాయ్ కి రాకపోయినా స్క్రీన్ పై ఈ మ్యాచ్ చూస్తూ కనిపించాడు. 

ALSO READ | IND Vs PAK: ఆడింది చాలు పో.. పో.. బాబర్‌కు హార్దిక్ బై బై సెండాఫ్

అభిషేక్ శర్మ,తిలక్ వర్మ భారత టీ20 జట్టులో స్టార్ ఆటగాళ్లు. వీరిద్దరికీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో స్థానం దక్కలేదు. తిలక్ వర్మకు ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన అనుభవమే ఉండగా.. వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ మ్యాచ్  విషయానికి వస్తే.. ప్రస్తుతం పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజ్ లో తయ్యబ్ తాహీర్(5), అఘా సల్మాన్(4) ఉన్నారు. సౌద్ షకీల్ 62 పరుగులు చేసి రాణించగా.. రిజ్వాన్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, జడేజా తలో వికెట్ పడగొట్టారు.