ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ భారత్ శుభారంభం చేసింది. శనివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ 176 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్ ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఔట్ చేసిన ఆనందంలో నోటికి పని చెప్పాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(36; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్ శర్మ(35; 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ జోడి అబ్బాస్ అఫ్రిది వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టారు. మొదటి నాలుగు బంతులను అభిషేక్ శర్మ 4, 4, 6, 6గా మలవగా.. ఆఖరి బంతిని ప్రభ్‌సిమ్రాన్ బౌండరీ బాదాడు.
ALSO READ | రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్
బయటకు వెళ్లు అన్నట్లు సంజ్ఞలు..
ఆ సమయంలో బంతికి అందుకున్న పాక్ స్పిన్నర్ బౌలర్ సుఫియన్ ముఖీమ్.. ఏడో ఓవర్ తొలి బంతికే అభిషేక్ శర్మను వెనక్కి పంపాడు. ఆ ఆనందంలో ముఖీమ్ నోటికి పనిచెప్పాడు. ఆడింది చాలు.. బయటకు వెళ్లు అన్నట్లు సంజ్ఞలు చేశాడు. పాక్ బౌలర్ నోటి దూలతో ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ ధీటుగా బదులిచ్చాడు. అతనిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు అడ్డుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
WATCH:
— Junaid (@ccricket713) October 19, 2024
SUFIYAN MUQEEM ASKED ABHISHEK SHARMA TO LEAVE THE GROUND#INDvPAK #EmergingAsiaCup2024 pic.twitter.com/RJHOLCULYc