KL రాహుల్ రికార్డ్ బద్దలు: IPL చరిత్రలోనే తొలి ఇండియన్ బ్యాటర్‎గా అభిషేక్ నయా రికార్డ్

KL రాహుల్ రికార్డ్ బద్దలు: IPL చరిత్రలోనే తొలి ఇండియన్ బ్యాటర్‎గా అభిషేక్ నయా రికార్డ్

హైదరాబాద్: ఐపీఎల్ 18లో భాగంగా శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్‎తో జరిగిన మ్యాచులో ఎస్ఆర్‎హెచ్ బ్యాటర్ అభిషేక్ వర్మ ఆకాశమే హద్దుగా చేలరేగాడు. స్పిన్నరా.. పేసరా అని చూడకుండా బాల్‎ను స్టాండ్స్‎కు పంపడమే టార్గెట్ అన్నట్లుగా రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 55 బంతుల్లోనే (14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) చిరస్మరణీయ సెంచరీ సాధించాడు.

అభిషేక్ తుఫాన్ ఇన్సింగ్స్‎తో 246 పరుగుల కొండంత లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఎస్ఆర్‎హెచ్ అలవోకగా ఛేజ్ చేసి సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెరుపు ఇన్సింగ్స్‎తో అభిషేక్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (141) చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‎గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాహుల్ 132 రన్స్ చేశాడు. 

పంజాబ్‎పై 141 పరుగులు చేసి ఈ రికార్డును అభిషేక్ తుడిచిపెట్టాడు. ఇక.. ఐపీఎల్ హిస్టరీలో ఇది ఓవరాల్‎గా మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. డేంజరస్ బ్యాటర్ క్రిస్ గేల్ 175 పరుగులతో టాప్‎లో ఉన్నాడు. 158 పరుగులతో బ్రెండన్ మెకల్లమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. అలాగే.. ఐపీఎల్‌లో రెండో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ చిచ్చర పిడుగు ఒక్క ఇన్నింగ్స్‌లో 24 బౌండరీలు బాదగా.. మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు.

ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్స్:

అభిషేక్ శర్మ     141 పరుగులు
కెఎల్ రాహుల్ 132* పరుగులు
శుభ్‌మాన్ గిల్ 129 పరుగులు
రిషబ్ పంత్    128* పరుగులు
మురళీ విజయ్ 127 పరుగులు