హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20 లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. తొలి టీ20 మ్యాచ్ లో డకౌటైనా రెండో మ్యాచ్ లో మాత్రం అదరగొడుతున్నాడు. పవర్ ప్లే లో తడబడిన ఈ యంగ్ ప్లేయర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా మయర్స్ వేసిన 11 ఓవర్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఓవర్లో వరుసగా 2, 4,6,4,6,4 బాదేశాడు. దీంతో ఈ ఒక్క ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి.
33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ కు గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(71) గైక్వాడ్ (33) క్రీజ్ లో ఉన్నారు. గిల్ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు.
ABHISHEK SHARMA SMASHED 1WD,2,4,6,4,6,4 - 28 RUNS IN A SINGLE OVER. 🤯 pic.twitter.com/CXMo1GSci4
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2024