ICC T20I rankings: ఒక్క సిరీస్‌తోనే సంచలనం.. టాప్-2 లో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి

ICC T20I rankings: ఒక్క సిరీస్‌తోనే సంచలనం.. టాప్-2 లో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ ఒక్క మ్యాచ్ తోనే శరవేగంగా దూసుకొచ్చాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20 37 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ యువ ఓపెనర్ మొత్తం 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సులతో 135 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో అభిషేక్ 219.68 స్ట్రైక్ రేట్‌తో  55.80 యావరేజ్ తో 279 పరుగులు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వీటిలో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. 

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. హెడ్ కు, అభిషేక్ శర్మకు మధ్య కేవలం 26 రేటింగ్ పాయింట్లు వ్యత్యాసం మాత్రమే ఉంది. తిలక్ వర్మ మూడో స్థానంలో ఉండగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానానికి పడిపోయాడు. టీమిండియాపై ఘోరంగా విఫలమైన పిల్ సాల్ట్ నాలుగో స్థానానికి పడిపోయాడు. కొంత కాలంగా టీ20లకు దూరంగా ఉన్న జైశ్వాల్ 12 ర్యాంక్ కు పడిపోయాడు.    

ALSO READ | Mohammed Shami: 15 నెలల తర్వాత తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై షమీ కన్ను

బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ ఏకంగా రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ తమిళ నాడు స్పిన్నర్ ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 5 మ్యాచ్ లో 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. వరుణ్ బౌలింగ్ ఆడడానికి ఇంగ్లాండ్ పూర్తిగా తడబడింది. అతడు 705 రేటింగ్ పాయింట్లతో అదిల్ రషీద్ తో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ తన నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ 9 ర్యాంక్ లో ఉన్నాడు.