
ఐపీఎల్ లో 2024 లో సత్తా చాటి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అభిషేక్ శర్మ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో డకౌటయ్యాడు. దీంతో ఈ యువ ప్లేయర్ పై కొంతమంది విమర్శలు చేశారు. అయితే ఈ యువ ప్లేయర్ గాడిలో పడడానికి ఒక మ్యాచ్ సరిపోయింది. జింబాబ్వేపై ఆదివారం (జూలై 7) హరారే వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో మెరుపు సెంచరీతో విశ్వరూపం చూపించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ఆతిథ్య జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన అభిషేక్.. 50 నుంచి 100కి కేవలం 13 బంతులు తీసుకోవడం గమనార్హం.
వెల్లింగ్టన్ మసకద్జ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత అభిషేక్ తన గురువు యువరాజ్ సింగ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. ఎంతో సంతోషంతో యువీతో తన సెంచరీ గురించి మాట్లాడాడు. ఐపీఎల్ సమయంలోనూ యువీపై అభిషేక్ చాలా సందర్భాల్లో ప్రసంశలు కురిపించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. యువరాజ్ సింగ్ తో పాటు ఈ యువ క్రికెటర్ తన ఫ్యామిలీకి ఫోన్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 234/2 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (47 బాల్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) మెరుపు సెంచరీకి తోడు రుతురాజ్ గైక్వాడ్ (47 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 77 నాటౌట్), రింకూ సింగ్ (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) దుమ్ము రేపారు. జింబాబ్వేపై ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఉన్న 186 రన్స్‌ను అధిగమించింది. తర్వాత జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 రన్స్‌కే ఆలౌటైంది. వెస్లీ మదెవెరె (43) టాప్ స్కోరర్. అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం జరుగుతుంది.
Two extremely special phone ? calls, one memorable bat-story ? & a first ? in international cricket!
— BCCI (@BCCI) July 8, 2024
?? ??? ????!
A Hundred Special, ft. Abhishek Sharma ? ? - By @ameyatilak
WATCH ? ? #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9