
ఐపీఎల్(IPL) పుణ్యమా అని భారత క్రికెటర్ల రాత మారిపోతోంది అనడానికి నిదర్శనం ఈ కథనం. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే, ఒంటిపై లక్ష రూపాయల విలువైన షర్ట్ ధరించొచ్చు చెప్పండి. పోనీ, అదొక్కటేనా అంటే కాదు.. ప్యాంట్, షూస్, మెడలో చెయిన్, చేతికున్న వాచ్ అన్నీ ఖరీదైనవే. ఒంటిపైనే దాదాపు రూ.20 లక్షలు విలువైనవి ధరించి తిరుగుతున్నాడు.. మన సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma).
గత ఐపీఎల్ సీజన్‌లో అభిషేక్ శర్మ పరుగుల వరద పారించాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఎన్నో మ్యాచ్ ల్లో మెరుపు ఆరంభాలు ఇచ్చాడు. దాంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) యాజమాన్యం రూ. 14 కోట్లు వెచ్చించి మరీ అతన్ని అంటి పెట్టుకుంది. ఆ మొత్తాన్ని మనోడు బట్టలకు, షూస్‌కు, వాచ్‌లకే ఖర్చు పెడుతున్నట్టున్నాడు. అతను ఒంటిపై ధరించిన వాటిని చూస్తే, ఆ రూ. 14 కోట్లు సరిపోవనుకోండి. యాడ్‌ల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇందుకే ఖర్చు పెట్టేస్తున్నట్టున్నాడు.
ఎప్పుడు ధరించాడంటే..?
ఐదు రోజుల క్రితం ఫిబ్రవరి 23న దుబాయి వేదికగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌కు మనోడు ఇవన్నీ వేసుకొని హాజరయ్యాడు. ఇంకేముంది.. చూసిన వారంతా బాగున్నాయ్ అని ప్రశంసించటమే. ఆఖరికి పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ సైతం అభిషేక్ శర్మ డ్రెస్సింగ్ స్టయిల్‌ను అభినందించారట.
అతని ఒంటిపై ఉన్న వస్తువుల ధరలు ఓసారి చూద్దాం..
- షర్ట్ ధర: రూ. లక్ష 22 వేలు (పారిస్ లగ్జరీ బ్రాండ్ కాసాబ్లాంకా(Casablanca))
- ప్యాంట్ ధర: రూ. లక్ష 59 వేలు (పారిస్ లగ్జరీ బ్రాండ్ కాసాబ్లాంకా(Casablanca))
- షూస్ ధర: రూ. లక్ష 30 వేలు (పారిస్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్)
- వాచ్ ధర: రూ.9 లక్షల 90 వేలు (స్విట్జర్లాండ్ లగ్జరీ బ్రాండ్ రోలెక్స్ GMT మాస్టర్ II)
- మెడలో గోల్డ్ చెయిన్: 3 తులాలు.. 3 లక్షలు
ఈ లెక్కన మనోడు ఒంటిపైనే దాదాపు రూ.20 లక్షలు విలువైనవి ధరించి తిరుగుతున్నాడు. ఇతని దుస్తులపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.
bro casually wears the annual ctc of half of the cs engineers. 😭 pic.twitter.com/zUafI6PkjG
— Neeche Se Topper (@NeecheSeTopper) February 27, 2025