ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్ గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. తొలుత ఉద్యోగులు మున్సిపల్ సంస్థ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, కమిషనర్ కు పూల బొకే అందజేసి స్వాగతం పలికారు. ఇప్పటి వరకు అభిషేక్ అగస్త్య మేడ్చల్– మల్కాజిగిరి స్థానిక సంస్థల కలెక్టర్ గా పనిచేశారు.
మొన్నటి వరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లా కు కలెక్టర్ గా బదిలీకాగా, ఆయన స్థానంలో అభిషేక్ అగస్త్య ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఎస్ఈ రంజిత్, ఈఈ కృష్ణలాల్, డిప్యూటీ ఈఈ ధరణి, నవ్యజ్యోతి, ఏఈ సతీశ్, ఏసీపీ వసుంధర కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.