రామయ్యకు పంచామృతాలతో అభిషేకం

భద్రాచలం,వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలవరులకు ఆవుపాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెలతో అభిషేకం చేసి, సమస్త నదీ, సముద్ర జలాలతో స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు పసుపు ముద్దలు పంపిణీ చేశారు. అనంతరం మూలవరులకు బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం చేశారు. 83 జంటలు కంకణాలు ధరించి ఈ క్రతువును నిర్వహించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. వీకెండ్ ​కావడంతో భక్తులతో ఆలయం పోటెత్తింది.