నిజామాబాద్, వెలుగు : బోధన్ డివిజన్లోని బెల్ట్ షాప్‌లపై ఉన్నతాధికారులు దాడి చేయనున్నారనే సమాచారాన్ని లీక్ చేసిన సీఐ ప్రమోద్‌గౌడ్ తీరు వివాదాస్పదమైంది. రైడ్స్ ముగిసేదాకా పర్మిషన్లేని కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని ఆయన వాట్సాప్ గ్రూపులో కోరిన మెసేజ్ మీడియా గ్రూప్‌లకు చేరడంతో విషయం బయటపడింది.
లిక్కర్ సేల్‌ను బెల్ట్ దుకాణాల ద్వారా ఎంకరేజ్ చేస్తున్న ఆయన ఇందుకోసం వాట్సాప్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నట్లు తేలింది. ఆదివారం హైదరాబాద్ నుంచి వస్తున్న స్పెషల్ ఆఫీసర్ల టీం బెల్ట్ షాప్‌ల గురించి ఆరా తీయనున్నారని, వారు వెళ్లేదాకా షాప్‌లు క్లోజ్ పెట్టాలని ఆయన మెసేజ్ చేశారు.