19 కిలోల గంజాయి పట్టివేత

19 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు : గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని భద్రాచలంలోని బ్రిడ్జి పాయింట్​ వద్ద ఆబ్కారీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఆబ్కారీ చెక్​ పోస్టు సీఐ లావణ్య తెలిపిన ప్రకారం.. శనివారం బ్రిడ్జి పాయింట్​ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బస్సులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.

అదుపులోకి తీసుకొని విచారించగా అతడి వద్ద రూ.3.75 లక్షల విలువైన19 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడు ముంబైకి చెందిన యువకుడు. అతడు ఒడిశాలో కిలో గంజాయిని రూ.4వేల చొప్పున మొత్తం19 కిలోలు కొనుగోలు చేసి ముంబైకి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.