భద్రాచలంలో 15 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం పట్టణంలో అబ్కారీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   కూనవరం రోడ్డులోని ఎంవీఐ ఆఫీసు వద్ద గురువారం భద్రాచలం అబ్కారీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రెండు బైకులపై ఇద్దరు యువకులు గంజాయి ప్యాకెట్లతో పట్టుబడ్డారు. ఒడిశాలోని మల్కనగిరి జిల్లా ధనంపేటకు చెందిన ఖిలా

చిత్రకూట్​కు చెందిన పాటీ ఖిలాలు గంజాయిని తీసుకుని హైదరాబాద్​కు వెళ్తున్నట్లు తేలింది. వారి నుంచి రూ.2.50 లక్షల విలువైన 15 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. తనిఖీల్లో సీఐ రహీమున్నీషా బేగం సిబ్బంది పాల్గొన్నారు.