- నర్సింగ్ అధికారులు, స్టాఫ్ నర్సులు
ఖైరతాబాద్,వెలుగు : బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన 317 జీవో కారణంగా తాము స్థానికత కోల్పోయామని బాధిత నర్సింగ్ అధికారులు, స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో అమలుతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విధులకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో బాధితులు రాపోలు శేఖర్, మమత, కిరణ్‌కుమార్,మంజుల మాట్లాడుతూ..
జాబ్ ఇచ్చింది భువనగిరిలో అయితే.. 317 జీవో అమలుతో జోగులాంబ గద్వాల్ జిల్లాకు పంపారని పేర్కొన్నారు. ఇలా అన్యాయం జరిగిందని, ఈ జీవోను రద్దు చేసినా లేకుంటే.. సవరణ అయినా చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు తమను పాత స్థానిక తీసుకొచ్చి తమను ఆదుకోవాలని వారు కోరారు.
ALSO READ: కనీస వేతనాల అమలు జరిగేనా?