ఛత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్​ కౌంటర్​.. 12 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​ గఢ్​ లో భారీ   ఎన్​ కౌంటర్​.. 12 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​ గడ్​ లో మరో భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది, అబూజ్​మడ్​ అవీప్రాంతంలో పోలీసులకు.. మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. 

ఛత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అబూజ్​మడ్  లో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.   భారీగా ఆయుధాలను, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.  వరస దెబ్బలు... మావోయిస్టులకు ఇటీవల వరస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. 

మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. పక్కా సమాచారంతో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు... మావోయిస్టులు ఎదరుపడ్డారు.  దీంతో రెండు వర్గాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.  

Also Read : ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్

అబూజ్​ మడ్​ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, మావోలు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించి ఎదురు కాల్పులతో బదులిచ్చాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.  

అబూజ్ మఢ్  దట్టమైన అడవిలోని ఒక కొండ ప్రాంతం. ఇది నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. భౌగోళికంగా మావోయిస్ట్ లకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడికి చేరుకోవడం అత్యంత క్లిష్టతరం. ఈ ప్రాంతాన్ని మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా పరిగణిస్తారు. చత్తీస్ గఢ్ కేంద్రంగా మావోయిస్ట్ ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. మావోల జాడపై సమాచారం తెలిసిన వెంటనే సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి, ఎన్ కౌంటర్ లు చేపడ్తున్నారు. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే చాలామంది మావోలు మృతి చెందారు