సుడాన్లోఘోరం.. వైమానిక దాడుల్లో13 మంది పిల్లలు మృతి

సుడాన్లోఘోరం.. వైమానిక దాడుల్లో13 మంది పిల్లలు మృతి

సూడాన్​లోని నార్త్ డార్ఫర్​లో ఘోరం

కైరో: సూడాన్ మిలిటరీ, ప్రత్యర్థి పారా మిలిటరీ మధ్య జరిగిన పోరులో దాదాపుగా13 మంది చిన్నారులు చనిపోయారు. శుక్రవారం నార్త్ డార్ఫర్ అల్ కుమా పట్టణంలోని మార్కెట్​ను లక్ష్యంగా చేసుకుని సుడాన్ ఆర్మీ  వైమానిక దాడులు జరపడంతో ఈ ఘోరం చోటుచేసుకుందని యూనిసెఫ్ తెలిపింది. 

“పిల్లలపై జరిగిన ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోం. యుద్ధాలు, అంతర్యుద్ధాలలో పిల్లలకు ఎటువంటి పాత్ర ఉండదు. దేశంలో అంతర్యుద్ధం ముదురుతున్న కొద్దీ పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు” అని సూడాన్ లోని యూనిసెఫ్ ప్రతినిధి షెల్డన్ యెట్ తెలిపారు.