2024 ఆర్థిక సంవత్సరానికి 6 కోట్ల ఐటీఆర్​లు

2024 ఆర్థిక సంవత్సరానికి 6 కోట్ల ఐటీఆర్​లు
  • ఫైలింగ్​కు నేడే ఆఖరు తేదీ

న్యూఢిల్లీ: 2023–-24లో సంపాదించిన ఆదాయం కోసం దాదాపు 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దాఖలయ్యాయని, వీటిలో 70 శాతం రిటర్నులు కొత్త పన్ను విధానం ప్రకారం వచ్చాయని  కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మంగళవారం తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన  మాట్లాడుతూ కొత్త విధానానికే ఎక్కువ మంది మొగ్గుచూపారని అన్నారు.

  2022–-23 ఆర్థిక సంవత్సరానికి 8.61 కోట్ల ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దాఖలయ్యాయి. మనదేశంలో రెండు వ్యక్తిగత ఆదాయ పన్ను విధానాలు ఉన్నాయి. పాత ఆదాయపు పన్ను విధానంలో, పన్ను రేట్లు ఎక్కువగా ఉంటాయి కానీ పన్ను చెల్లింపుదారులు అనేక మినహాయింపులను,  తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు.   కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. తగ్గింపులు తక్కువగా ఉంటాయి.  ఐటీఆర్​ఫైలింగ్​కు బుధవారమే ఆఖరు తేదీ అని ఐటీశాఖ తెలిపింది.