
బీర్కూర్, వెలుగు: నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కల్తీ కల్లుకు ఈ నెల 7న సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమతి లేని కల్లు దుకాణాలను ఎక్సైజ్ శాఖ అధికారులు మూసివేయించారు. దీంతో గ్రామాల్లో కల్లు దొరకకపోవడంతో పలువురు వింతగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలో ఈ సమస్య అధికంగా ఉంది.
విషయం తెలుసుకున్న వైద్యాధికారులు గ్రామానికి వెళ్లి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అనంతరం కల్లు బాధితులు మాట్లాడుతూ యువకులు వేరే గ్రామాల నుంచి కల్లు తెచ్చుకుంటున్నారని, వృద్ధులమైన తమకు కల్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామన్నారు. కల్లు లేకపోతే నిద్ర రావడంలేదని, పిచ్చిగా ఉంటుందని పేర్కొన్నారు.