పాతికేండ్లు నిండకముందే కోట్లలో సంపాదిస్తున్న లోకేష్‌‌‌‌

పాతికేండ్లు నిండకముందే కోట్లలో సంపాదిస్తున్న లోకేష్‌‌‌‌

అతనికి గేమ్స్ ఆడడమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నే కెరీర్‌‌‌‌‌‌‌‌గా మలుచుకుని సక్సెస్‌‌‌‌ అయ్యాడు. హైదరాబాద్‌‌‌‌లో పుట్టి, పెరిగిన ఈ హిందీ యూట్యూబర్‌‌‌‌‌‌‌‌కి  దేశమంతా ఫాలోవర్స్ ఉన్నారు. కోటిన్నర మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రతి వీడియోకి లక్షల్లో వ్యూస్‌‌‌‌ వస్తున్నాయి. పాతికేండ్లు నిండకముందే కోట్లలో సంపాదిస్తున్న లోకేష్‌‌‌‌. లోకేష్ పూర్తి పేరు లోకేష్ రాజ్ సింగ్. ఇండియాలోని ప్రముఖ కంటెంట్‌‌‌‌ క్రియేటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 2000 మార్చి 17న హైదరాబాద్‌‌‌‌లో పుట్టాడు. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌‌‌‌లో చదువుకున్నాడు. 2017 నవంబర్ 16న ‘‘లోకేష్‌‌‌‌ గేమర్‌‌‌‌‌‌‌‌” పేరుతో ఒక యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ని పెట్టాడు. కానీ.. రెండేండ్ల తర్వాత యూట్యూబర్‌‌‌‌‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ ఛానెల్‌‌‌‌కు 15.1  మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఉన్నారు. అతని ఛానెల్‌‌‌‌లోని ప్రతి వీడియోకి మూడు లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌‌‌‌ వచ్చాయి. అతని వీడియోలకు ఇప్పటివరకు 1.5 బిలియన్లకు పైగా వ్యూస్‌‌‌‌ వచ్చాయి. 

వెయ్యి వీడియోలు
2017లో ఛానెల్‌‌‌‌ మొదలుపెట్టినా 2019 ఏప్రిల్7న ‘‘లోకేష్ గేమర్” ఛానెల్‌‌‌‌లో మొదటి వీడియో అప్‌‌‌‌లోడ్ చేశాడు. ఇప్పటివరకు వెయ్యి కంటే ఎక్కువ వీడియోలు ఈ ఛానెల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. ఎక్కువమంది అతన్ని ఈ ఛానెల్‌‌‌‌ పేరుతోనే పిలుస్తుంటారు. 2020లో బాగా ఫేమస్‌‌‌‌ అయిన గరెనా ఫ్రీ ఫైర్ గేమ్‌‌‌‌ని ఎక్కువగా ఆడుతుంటాడు. ఆ వీడియోలనే యూట్యూబ్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తున్నాడు లోకేష్‌‌‌‌. ఏఎస్‌‌‌‌ గేమింగ్, గ్యాన్ గేమింగ్ లాంటి పెద్ద ఛానెళ్లతో కలిసి వీడియోలు చేస్తున్నాడు. అతని ఫ్యాన్స్‌‌‌‌ లోకేష్‌‌‌‌ని ‘‘డైమండ్ కింగ్” అని పిలుస్తారు. 

ఆరు ఛానెల్స్​
‘లోకేష్‌‌‌‌ గేమర్‌‌‌‌‌‌‌‌’ అనే మెయిన్‌‌‌‌ ఛానెల్‌‌‌‌తో పాటు మరో ఐదు ఛానెల్స్​ నడుపుతున్నాడు లోకేష్‌‌‌‌. ‘‘ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌7 గేమింగ్”అనే  పేరుతో అతను నడుపుతున్న రెండో ఛానెల్‌‌‌‌కు 1.16 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఉన్నారు. ఇందులో రోజూ ‘‘ఫ్రీ ఫైర్’’ని లైవ్ స్ట్రీమ్‌‌‌‌ చేస్తుంటాడు. ‘‘ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌7 షార్ట్స్‌‌‌‌” అనే ఛానెల్‌‌‌‌కు లక్షా 58 వేల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఉన్నారు. ఇందులో అతను ఎక్కువగా షార్ట్ వీడియోలు పెడుతుంటాడు. ‘‘ఎల్‌‌‌‌7 మూన్” అనే మరో ఛానెల్‌‌‌‌కు నాలుగు లక్షల 85 వేల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఉన్నారు. ‘‘ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌7 బీస్ట్‌‌‌‌” ఛానెల్‌‌‌‌ను యాభై వేల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌ చేసుకున్నారు. ‘‘ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌7 హైలైట్స్‌‌‌‌”, ‘‘ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌7 రియా” ఛానెళ్లను 48 వేల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌ చేసుకున్నారు.
   
ఫేవరెట్‌‌‌‌ వెపన్‌‌‌‌ 
ఫ్రీ ఫైర్‌‌‌‌‌‌‌‌లో లోకేష్‌‌‌‌ దగ్గర దాదాపు అన్ని పెద్ద వెపన్స్ ఉన్నాయి. అతను మాత్రం ఎస్‌‌‌‌పీఏఎస్‌‌‌‌12ని బాగా ఇష్టపడతాడు. లోకేష్‌‌‌‌ ఎక్కువగా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసమే ఆడతాడు. కాబట్టి ఎప్పటికప్పుడు వెపన్స్ మార్చుకుంటాడు. అతని స్ట్రీమ్స్‌‌‌‌లో ఎక్కువగా ఏకే47 కనిపిస్తుంటుంది. 

లేటెస్ట్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌
లోకేష్ గేమ్స్ ఆడడానికి, వాటిని స్ట్రీమ్‌‌‌‌ చేయడానికి దాదాపు 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ కొన్నాడు. ఆ గేమింగ్ సెటప్‌‌‌‌ మొత్తాన్ని చూపిస్తూ ఒక వీడియో కూడా షేర్ రిలీజ్‌‌‌‌ చేశాడు. అతనికి మూడు పర్సనల్‌‌‌‌ కంప్యూటర్లు ఉన్నాయి. వాటితో పాటు ఖరీదైన మైక్‌‌‌‌లు, కెమెరాలు కూడా ఉన్నాయి. లోకేష్‌‌‌‌ ఫ్రీ ఫైర్‌‌‌‌ కోసం కూడా బాగానే ఖర్చు చేస్తుంటాడు. లక్షల రూపాయల విలువైన గ్లోబల్ బ్యాడ్జ్‌‌‌‌లను కొంటుంటాడు.
 
ఆదాయం
లోకేష్ రాజ్ సింగ్ చేసే ప్రతి వీడియోకు సగటున మిలియన్ వ్యూస్‌‌‌‌ వస్తుంటాయి. ప్రతి నెలా ప్రమోషన్లు, యాడ్స్‌‌‌‌ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇప్పటివరకు అతను దాదాపు ఐదారు కోట్ల రూపాయలు సంపాదించాడు. సంపాదనకు తగ్గట్టుగానే లగ్జరీగా లైఫ్‌‌‌‌ లీడ్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం 70 వేల రూపాయల విలువైన గూచీ షూ కొన్నాడు. బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఒక లగ్జరీ కారు వాడుతున్నాడు.