గతంలో కాల్పుల ఘటనలు.. 1865లో అబ్రహం లింకన్ మృతి

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై కాల్పులను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్​పై 20 ఏండ్ల యువకుడు కాల్పులు జరిపాడు. గతంలో కూడా పలువురు అధ్యక్షులు, మాజీ ప్రెసిడెంట్లు, పలు పార్టీలకు చెందిన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్​లపై ఈ తరహా దాడులు జరిగాయి. 19వ శతాబ్దం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 

జరిగిన కాల్పుల ఘటనలు వివరాలు..

అబ్రహం లింకన్

1865 ఏప్రిల్ 14న వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్​లో జరిగిన ఓ ప్రోగ్రామ్​కు హాజరైన అబ్రహం లింకన్​పై.. జాన్ విల్కెస్ బూత్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ లింకన్​​ కోలుకోలేదు.

జేమ్స్‌‌ గార్ఫీల్డ్‌‌

1881 జులై 2న జేమ్స్ గార్ఫీల్డ్ హత్యకు గురయ్యారు. ఇంగ్లండ్ వెళ్లేందుకు వాషింగ్టన్​లోని ఓ రైల్వే స్టేషన్​కు బయల్దేరిన టైమ్​లో చార్లెస్ గిటౌ అనే దుండగుడు అతనిపై కాల్పులు జరిపాడు. చికిత్స పొందుతూ 2 నెలల తర్వాత కన్నుమూశారు.

విలియం మెక్​కిన్లే

1901సెప్టెంబర్ 6న విలియం మెక్​కిన్లేపై న్యూయార్క్​లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. వారంపాటు చికిత్స అందించినా బతకలేదు.

జాన్ ఎఫ్ కెన్నడి

1963 నవంబర్​లో డాలస్ సందర్శనకు వెళ్లిన సమయంలో జాన్ ఎఫ్ కెన్నడిపై దుండగుడు కాల్పులు జరిపాడు. తీసుకెళ్లిన కొద్దిసేపటికే కెన్నడి చనిపోయాడు.

యపడి.. ప్రాణాలతో బయటపడిన వారిలో..

థియోడర్ రూజ్​వెల్ట్​పై1912 అక్టోబర్ 14న విస్కాన్సిన్​లోని మిల్వాకీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జాన్​ష్రాంక్  అనే సెలూన్ కీపర్ కాల్పులు జరిపాడు. అయితే, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. రొనాల్డ్ రీగన్​పై 1981, మార్చి 30న వాషింగ్టన్​లోని హిల్టన్  హోటల్ వద్ద హత్యాయత్నం జరిగింది.

కాగా, హత్యాయత్నానికి గురైన మాజీ ప్రెసిడెంట్లలో అండ్రూ జాక్సన్, హెర్బర్ట్ హూవర్, ఫ్రాంక్లిన్ డి. రూజ్‌‌వెల్ట్, హ్యారీ ఎస్.ట్రూమాన్,  జార్జ్ సి.వాలెస్, గెరాల్డ్ ఫోర్డ్, 
జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా ఉన్నారు.