Abu Dhabi T10 League 2024: ఎడారి దేశంలో క్రికెట్ జాత‌ర‌.. నేటి (నవంబర్ 21) నుంచే అబుదాబి టీ10 లీగ్

Abu Dhabi T10 League 2024: ఎడారి దేశంలో క్రికెట్ జాత‌ర‌.. నేటి (నవంబర్ 21) నుంచే అబుదాబి టీ10 లీగ్

ఎడారి దేశంలో పొట్టి క్రికెట్ జాత‌ర‌కు సమయం ఆసన్నమైంది. బ్యాటర్ల మెరుపులు, బౌలర్ల ఎత్తుగడలు, ఫీల్డర్ల విన్యాసాలతో అబ్బురపరిచే అబుదాబి టీ10 లీగ్ గురువారం(న‌వంబ‌ర్ 21) నుంచి షురూ కానుంది. ఈసారి జ‌రుగ‌బోతున్న ఎనిమిదో సీజ‌న్‌కు ఓ ప్రత్యేక‌త ఉంది. మున‌పెన్నడూ లేని విధంగా ఈ సీజ‌న్‌లో 10 జ‌ట్లు టైటిల్ కోసం తలప‌డ‌తున్నాయి.

12 రోజులు.. 40 మ్యాచ్‌లు

10 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో జ‌రిగే ఈ టోర్నీ 12 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. మొత్తం 40 మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రౌండ్ రాబిన్ ప‌ద్ధతిలో అన్ని జట్లు ఇతర జట్లతో తలపడతాయి. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్ – 5 జ‌ట్లు ఫైన‌ల్ బెర్తు కోసం త‌ల‌ప‌డుతాయి. డిసెంబర్ 2న ఫైనల్ జరగనుంది. 

పాల్గొనే 10 జ‌ట్లు ఇవే.. 

  • న్యూయార్క్ స్ట్ర‌యిక‌ర్స్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్) 
  • ద‌క్కన్ గ్లాడియేట‌ర్స్: నికోలస్ పూరన్ (కెప్టెన్)
  • ఢిల్లీ బుల్స్: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్)
  • టీమ్ అబుదాబీ: ఫిల్ సాల్ట్ (కెప్టెన్) 
  • నార్తర్న్ వారియ‌ర్స్: ట్రెంట్ బౌల్ట్ (కెప్టెన్)
  • మొర్రిస్‌విల్లే సాంప్ ఆర్మీ: రోహన్ ముస్తఫా (కెప్టెన్) 
  • బంగ్లా టైగర్స్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్)
  • చెన్నై బ్రేవ్ జాగ్వార్స్: తిసార పెరీరా (కెప్టెన్)
  • యూపీ న‌వాబ్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (కెప్టెన్)
  • అజ్మన్ బోల్ట్స్: మహ్మద్ నబీ (కెప్టెన్)

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

అబుదాబి టీ10 లీగ్ మ్యాచ్‌లు మన దేశంలో స్టార్ స్పోర్ట్స్‌ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిజిటల్‌గా అభిమానులు ఫ్యాన్‌కోడ్‌లో యాప్ లో లైవ్ ఆస్వాదించవచ్చు.

అబుదాబి టీ10 లీగ్ షెడ్యూల్:

గురువారం (నవంబర్ 21)

  • మ్యాచ్ 1: టీమ్ అబుదాబి vs అజ్మాన్ బోల్ట్స్
  • మ్యాచ్ 2: మోరిస్విల్లే సాంప్ ఆర్మీ vs బంగ్లా టైగర్స్
  • మ్యాచ్ 3: డెక్కన్ గ్లాడియేటర్స్ vs చెన్నై బ్రేవ్ జాగ్వార్స్

శుక్రవారం (నవంబర్ 22)

  • మ్యాచ్ 4: నార్తర్న్ వారియర్స్ vs ఢిల్లీ బుల్స్
  • మ్యాచ్ 5: న్యూయార్క్ స్ట్రైకర్స్ vs మోరిస్విల్లే సాంప్ ఆర్మీ
  • మ్యాచ్ 6: యూపీ నవాబ్స్ vs టీమ్ అబుదాబి
  • మ్యాచ్ 7: అజ్మాన్ బోల్ట్స్ vs డెక్కన్ గ్లాడియేటర్స్

శనివారం (నవంబర్ 23)

  • మ్యాచ్ 8: మోరిస్విల్లే సాంప్ ఆర్మీ vs యూపీ నవాబ్స్
  • మ్యాచ్ 9: బంగ్లా టైగర్స్ vs న్యూయార్క్ స్ట్రైకర్స్
  • మ్యాచ్ 10: చెన్నై బ్రేవ్ జాగ్వార్స్ vs నార్తర్న్ వారియర్స్
  • మ్యాచ్ 11 - డెక్కన్ గ్లాడియేటర్స్ vs టీమ్ అబుదాబి

ఆదివారం (నవంబర్ 24)

  • మ్యాచ్ 12: యూపీ నవాబ్స్ vs నార్తర్న్ వారియర్స్
  • మ్యాచ్ 13 - ఢిల్లీ బుల్స్ vs అజ్మాన్ బోల్ట్స్
  • మ్యాచ్ 14 - న్యూయార్క్ స్ట్రైకర్స్ vs డెక్కన్ గ్లాడియేటర్స్
  • మ్యాచ్ 15 - మోరిస్విల్లే సాంప్ ఆర్మీ vs చెన్నై బ్రేవ్ జాగ్వార్స్

సోమవారం (నవంబర్ 25)

  • మ్యాచ్ 16: టీమ్ అబుదాబి vs న్యూయార్క్ స్ట్రైకర్స్
  • మ్యాచ్ 17: చెన్నై బ్రేవ్ జాగ్వార్స్ vs అజ్మాన్ బోల్ట్స్
  • మ్యాచ్ 18: ఢిల్లీ బుల్స్ vs బంగ్లా టైగర్స్

మంగళవారం (నవంబర్ 26)

  • మ్యాచ్ 19: యూపీ నవాబ్స్ vs డెక్కన్ గ్లాడియేటర్స్
  • మ్యాచ్ 20: బంగ్లా టైగర్స్ vs నార్తర్న్ వారియర్స్
  • మ్యాచ్ 21: మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ vs ఢిల్లీ బుల్స్

బుధవారం (నవంబర్ 27)

  • మ్యాచ్ 22: అజ్మాన్ బోల్ట్స్ vs బంగ్లా టైగర్స్
  • మ్యాచ్ 23: టీమ్ అబుదాబి vs చెన్నై బ్రేవ్ జాగ్వార్స్
  • మ్యాచ్ 24: యూపీ నవాబ్స్ vs న్యూయార్క్ స్ట్రైకర్స్

గురువారం (నవంబర్ 28)

  • మ్యాచ్ 25: డెక్కన్ గ్లాడియేటర్స్ vs బంగ్లా టైగర్స్
  • మ్యాచ్ 26: ఢిల్లీ బుల్స్ vs చెన్నై బ్రేవ్ జాగ్వార్స్
  • మ్యాచ్ 27: నార్తర్న్ వారియర్స్ vs న్యూయార్క్ స్ట్రైకర్స్

శుక్రవారం (నవంబర్ 29)

  • మ్యాచ్ 28: టీమ్ అబుదాబి vs మోరిస్విల్లే సాంప్ ఆర్మీ
  • మ్యాచ్ 29: న్యూయార్క్ స్ట్రైకర్స్ vs ఢిల్లీ బుల్స్
  • మ్యాచ్ 30: చెన్నై బ్రేవ్ జాగ్వార్స్ vs యూపీ నవాబ్స్
  • మ్యాచ్ 31: నార్తర్న్ వారియర్స్ vs అజ్మాన్ బోల్ట్స్

శనివారం (నవంబర్ 30)

  • మ్యాచ్ 32: బంగ్లా టైగర్స్ vs యూపీ నవాబ్స్
  • మ్యాచ్ 33: నార్తర్న్ వారియర్స్ vs టీమ్ అబుదాబి
  • మ్యాచ్ 34: అజ్మాన్ బోల్ట్స్ vs మోరిస్విల్లే సాంప్ ఆర్మీ
  • మ్యాచ్ 35: డెక్కన్ గ్లాడియేటర్స్ vs ఢిల్లీ బుల్స్

ఆదివారం (డిసెంబర్ 1)

  • క్వాలిఫైయర్ 1: TBA vs TBA
  • ఎలిమినేటర్ 1: TBA vs TBA
  • ఎలిమినేటర్ 2: TBA vs TBA

సోమవారం (డిసెంబర్ 2)

  • క్వాలిఫైయర్ 2: TBA vs TBA
  • ఫైనల్: TBA vs TBA