కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ABVP కార్యకర్తలు అరెస్ట్

వరంగల్లో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆందోళనలు కొనసాగుతున్నారు. మంత్రి టూర్ లో భాగంగా వరంగల్లోని పోచమ్మ మైదాన్ దగ్గర ABVP కార్యకర్తలు నిరసన తెలిపారు. కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ABVP విద్యార్థులను అదుపులోకి తీసుకొని.... స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.