మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్నారు ఏబీవీపీ కార్యకర్తలు. మహిళా డిగ్రీ కాలేజీ చుట్టూ మున్సిపాలిటీ నిర్మిస్తున్న కట్టడాలను ఆపాలని డిమాండ్ చేశారు. ABVP కార్యకర్తలు అడ్డుకోవడంతో రిమ్స్ దగ్గర రోడ్డుపై 15నిమిషాల పాటు ఆగిపోయింది మంత్రి కాన్వాయ్. తర్వాత పోలీసులు వచ్చి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ టైంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాన్వాయ్ ను ముందుకు పంపించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన చాలాసేపు ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.