విద్యకు 15% నిధులివ్వాలి: ఏబీవీపీ డిమాండ్

విద్యకు 15% నిధులివ్వాలి: ఏబీవీపీ డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ డిమాండ్​ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, జాయింట్​సెక్రటరీలు రాకేశ్, రాజు, కల్యాణి, శ్రీరాం, నేషనల్ ఎగ్జిక్యూటివ్​మెంబర్​జీవన్​మాట్లాడారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. గత బడ్జెట్​లో 7 శాతం నిధులు కేటాయించి, పూర్తిగా కూడా ఖర్చు చేయలేదన్నారు. ఫీజు బకాయిలు, స్కాలర్​షిప్​లను విడుదల చేయాలన్నారు.