డిచ్పల్లి, వెలుగు: పశ్చిమ్బెంగాల్లోని సందేశ్ఖలిలో జరిగిన ఘటనకు కారణమైన నిందితులను ఉరితీయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ డిమాండ్ చేశారు. టీఎంసీ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ మంగళవారం క్యాంపస్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీఎంసీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్లో అధికార టీఎంసీ పార్టీ అండతో ఒక వర్గానికి చెందిన మహిళలను టార్గెట్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సీఎం ఉన్నచోట ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమాలు చేస్తామన్నారు. వర్సిటీ ప్రెసిడెంట్ సాయి, సెక్రెటరీ అమృత్చారి, లీడర్లు రాకేశ్, హరికృష్ణ, ప్రమోద్, నాగరాజ్, సమీర్పాల్గొన్నారు.