స్కూళ్లలో సౌలతులు కల్పించాలి : సాతర్ల అర్జున్

స్కూళ్లలో సౌలతులు కల్పించాలి : సాతర్ల అర్జున్

వనపర్తి టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో సౌలతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్  సాతర్ల అర్జున్  డిమాండ్​ చేశారు. బుధవారం జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్  కొనసాగింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్ర్రైవేట్  స్కూళ్లను ఏబీవీపీ నాయకులు మూసి వేయించారు. అనంతరం రాజీవ్  చౌరస్తాలో పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. బాలకృష్ణ, రమ్య, కేదార్​నాథ్, దేవి, అరవింద్, వినయ్, జ్ఞానేశ్వర్, వెంకటేశ్, బాలు పాల్గొన్నారు.

నారాయణపేట : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు. జిల్లాలో విద్యా సంస్థల బంద్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కనీస మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. కార్పొరేట్, ప్రైవేట్  స్కూళ్లలో డొనేషన్ల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తన్నా పట్టించుకోవడం లేదన్నారు. చరణ్ రెడ్డి, వెంకటేశ్, వరుణ్, మంజునాథ్, మణికంఠ పాల్గొన్నారు.

గద్వాల టౌన్ : సర్కార్  బడుల్లో సౌలతులు కల్పించాలని డిమాండ్  చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా స్కూళ్లను బంద్  చేయించి నిరసన తెలిపారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్  సురేశ్​ మాట్లాడుతూ సౌలతులు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.