ప్రైవేట్​ స్కూళ్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ లీడర్లు

ప్రైవేట్​ స్కూళ్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ లీడర్లు

సిరిసిల్ల టౌన్,  వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ లీడర్లు ఆరోపించారు. శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డీఈవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు ఎలాంటి అనుమతులు లేకుండా, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు.

దీనిపై విద్యార్థులు, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదులు చేస్తున్నా డీఈవో పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేట్ స్కూళ్లతో కుమ్మక్కైన డీఈవోపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ లీడర్లు మారవేణి రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టేకు మధు, నాగరాజు, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అజయ్, గిరి తదితరులు పాల్గొన్నారు.