ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలి : ఏబీవీపీ నాయకులు

ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలి : ఏబీవీపీ నాయకులు
  •     డీఈవో ఆఫీస్ లను ముట్టడించిన ఏబీవీపీ నాయకులు

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్ వర్ధన్ అన్నారు. శుక్రవారం ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీఈవో ఆఫీస్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా వివేక్​మాట్లాడుతూ తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా స్టూడెంట్స్​బతుకులు మారలేదన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్తే బుక్స్, ఫీజులు, యూనిఫాం పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. 

ఈ విషయం డీఈవో దృష్టికి తీసుకెళ్తే ఒక చేతితో తాళం వేసి మరో చేతితో లంచం తీసుకొని వదిలేస్తున్నారని ఆరోపించారు. అనంతరం అడిషనల్ డీఈవో వెంకటరెడ్డికి మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో ఆదిత్య, పవన్, పర్శరాం, రాజేశ్, రాజు, మహేందర్, చందు, నవీన్, ఫణీందర్, అభినయ్, సంతోష్, భాను, రాకేశ్, సంజయ్, శంకర్, ప్రణయ్ పాల్గొన్నారు.

మెదక్​టౌన్ : డీఈవో రాధాకిషన్​ ప్రైవేట్​స్కూల్స్ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ స్టూడెంట్స్​కు నష్టం చేస్తున్నారని వెంటనే కలెక్టర్​ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు. పట్టణంలోని రాందాస్​ చౌరస్తాలో డీఈవో దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రైవేట్​స్కూల్స్​యజమానులు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నా డీఈవో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  కొంతమంది ఉద్యోగులు, వ్యాపారులు డీఈవోను అడ్డం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఉదయ్, విజ్ఞాన్, నిఖిల్, కార్తికేయ పాల్గొన్నారు. 

సంగారెడ్డి టౌన్: ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల ఫీజు దోపిడీ నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు జిల్లాలోని డీఈవో  ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ వచ్చి దశాబ్దం పూర్తి కావస్తున్నా అధికార పార్టీలు మారుతున్నాయి కానీ విద్యా వ్యవస్థలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ స్కూల్స్​లో టీచర్ల కొరత వేధిస్తుండగా ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తే ఫీజుల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే లంచాలకు అలవాటు పడి యథావిధిగా దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాజు, భారతి, మహేశ్, అనిల్, పవన్, దినేశ్, చింటూ, శంకర్, వెంకట్, రాహుల్, రమేశ్, ఉదయ్ పాల్గొన్నారు.