కలెక్టరేట్ ​ముందు ఏబీవీపీ ధర్నా : ఏబీవీపీ నాయకులు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు ఆదిలాబాద్ కలెక్టరేట్​ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్​ స్కూళ్లలో పాఠ్య పుస్తకాల విక్రయాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

లేకపోతే ఆందోళనఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ నాయకులు విఘ్నేశ్, సర్వజిత్, మహేశ్, నిఖిల్, కార్తీక్​ తదితరులు పాల్గొన్నారు.