ఫీజు బకాయిలు చెల్లించాలని రాస్తారోకో

ఫీజు బకాయిలు చెల్లించాలని రాస్తారోకో

కూకట్​పల్లి/ఇబ్రహీంపట్నం/పంజాగుట్ట, వెలుగు: పెండింగ్​ఫీజు రీయంబర్స్​మెంట్, స్కాలర్​షిప్స్ చెల్లించాలని డిమాండ్​చేస్తూ ఏబీవీపీ నాయకులు శుక్రవారం సిటీలోని వేర్వేరు చోట్ల రాస్తారోకో నిర్వహించారు. కూకట్​పల్లి జేఎన్​టీయూ చౌరస్తాలో హైవేపై బైఠాయించి విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. 

ఏబీవీపీ స్టేట్​ఎగ్జిక్యూటివ్​ మెంబర్​భరత్​రెడ్డి, కూకట్​పల్లి కన్వీనర్​ఆయుష్​మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేయడానికి  సిద్ధమైన ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం దారుణమన్నారు. వెంటనే రూ.7,500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని లేకుంటే ప్రజా భవన్​ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

 పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి తరలించారు. ఏబీవీపీ వీరపట్నం కన్వీనర్ దొంతగోని శివ కృష్ణ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో ప్రెస్​మీట్​పెట్టి ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్​చేశారు. ఎస్సార్​నగర్​చౌరస్తాలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనాథ్, సికింద్రాబాద్​జిల్లా కన్వీనర్​బాలు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.