ఓయూలో ఏబీవీపీ వినూత్న నిరసన

ఓయూలో ఏబీవీపీ వినూత్న నిరసన

ఓయూ, వెలుగు: ఓయూ క్యాంపస్​లో ఏబీవీపీ నాయకులు మంగళవారం వినూత్న నిరసనకు దిగారు. ఇటీవల వర్సిటీ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్​ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆర్ట్స్​కాలేజీ వద్ద చేతులకు సంకెళ్లు వేసుకుని... నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమాల గడ్డ ఓయూలో ఆందోళనలు, నినాదాలు చేయొద్దంటూ సర్క్యులర్​జారీ చేయడం కరెక్ట్ ​కాదన్నారు.