ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి : శివ

ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి : శివ
  • ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ

ఆర్మూర్, వెలుగు: ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శివ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ పిలుపులో భాగంగా బుధవారం ఆర్మూర్ మున్సిపల్​ పరిధిలోని పెర్కిట్​ స్కూల్​ వద్ద స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శివ మాట్లాడారు. 

Also read :   ​కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

గవర్నమెంట్​ స్కూల్స్​ లో మౌలిక వసతులు కల్పించాలని, టీచర్స్​ కొరత లేకుండా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని నియమించాలన్నారు.  విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ స్కూల్స్​ లో 25 శాతం పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. గవర్నమెంట్ గుర్తింపు లేని స్కూల్స్​ పై చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు, హరినాథ్, ప్రమోద్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.