
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) భూములను కాపాడాలని కోరుతూ రాజ్ భవన్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించిన 400 ఎకరాల హెచ్సీయూ భూముల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసులు వర్సిటీలోకి జేసీబీలతో చొరబడి విద్యార్థులపై దాడులు చేయడంతోపాటు జీవరాశులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు.
వారం రోజులుగా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, అయినా గవర్నర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని, జీవరాశులను, వర్సిటీ భూములను కాపాడాలని కోరారు.