జీవో 55ను వెనక్కి తీసుకోవాలని రాపాక సాయి డిమాండ్

జగిత్యాల టౌన్, వెలుగు: వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ఇచ్చిన జీవో 55ను వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడు రాపాక సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. శుక్రవారం ఏబీవీపీ నాయకులు పోలాస అగ్రికల్చర్ కాలేజీ ఎదుట నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలు కట్టడమంటే రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కడేమన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు  నందు, మనోహర్, ప్రశాంత్, జస్వంత్, రంజిత్, శివాజీ  పాల్గొన్నారు.