హైదరాబాద్, వెలుగు: తమ స్టూడెంట్లు మరో వరల్డ్ రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతున్నారని శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. వచ్చే నెల 5న 10 రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది 2.5 ఏండ్ల నుంచి 7 ఏండ్ల వయసున్న చిన్నారులు 100 ఎక్కాలను 100 నిమిషాల్లో అప్పజెప్పి రికార్డు సృష్టిస్తారని చెప్పారు. దీని కోసం 100 రోజులు చిన్నారులు శిక్షణ తీసుకున్నారని శుక్రవారం ఆమె మీడియాకు వివరించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్– లండన్ వాళ్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి రికార్డును నమోదు చేస్తారన్నారు.
శ్రీచైతన్య స్కూల్ అంటేనే గొప్ప భవిష్యత్, ధృఢమైన ఫౌండేషన్ అని, సైంటిఫిక్ మెథడ్స్, పరిశోధనాత్మక కరిక్యులమ్‌తో తమ స్టూడెంట్లు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు పాల్గొనే నాసా-ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లోనూ శ్రీచైతన్య వరుసగా 9వ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రికార్డ్‌లో భాగం కాబోతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు అభినందనలు తెలిపారు.