చొప్పదండి సిద్ధార్థ స్కూల్‌‌లో అకాడమిక్ ఎక్స్​పో

చొప్పదండి, వెలుగు : చొప్పదండి పట్టణంలోని సిద్ధార్థ స్కూల్‌‌లో అకాడమిక్ ఎక్స్​పో ప్రదర్శనను సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్​రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు అకాడమిక్​కు సంబంధించిన అంశాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థులు సులభంగా గ్రహించి నేర్చుకోవడానికి ఎంతో తోడ్పడుతుందన్నారు.