ఆస్కార్ అకాడమీకి విల్ స్మిత్ రాజీనామా

లాస్ ఏంజెల్స్: 92వ అకాడమీ అవార్డుల (ఆస్కార్‌) ప్రదానోత్సవంలో జరిగిన చెంపదెబ్బ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయం చెబుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్‌ హాట్‌ టాపిక్‌గా చర్చనీయాంశమైంది. విల్‌ స్మిత్‌పై ఆస్కార్‌ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉందని.. త్వరలోనే విల్‌ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవాశం ఉన్నట్లు వార్తల వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన తన ఆస్కార్ అకాడమీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రతిష్టాత్మక వేదికపై క్రిస్ రాక్ ను తాను చెంపదెబ్బ కొట్టడం క్షమించరానిదంటూ వ్యాఖ్యానించారు. 

‘ఆస్కార్ అకాడమీ పంపిన డిసిప్లినరీ నోటీస్ కు నేరుగా స్పందించా. నా చర్యలకు నాదే తప్పని ఒప్పుకుంటున్నా. ఆ వేడుకలో నేను ప్రవర్తించిన తీరు షాక్ కు గురిచేసింది. అకాడమీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశా. అందుకే మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని విల్ స్మిత్ చెప్పారు. బోర్డ్ తన మీద తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మరోపక్క స్మిత్ పంపిన రాజీనామాను అకాడమీ ఆమోదించింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు కొనసాగిస్తామని అకాడమీ ప్రెసిడెంట్ వెల్లడించారు. 

మరిన్ని వార్తల కోసం:

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్

‘ఆర్ఆర్ఆర్’పై కంగనా రనౌత్ ప్రశంసలు