వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిదీ నాయకత్వంలో 19 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును బంగ్లాతో సమరానికి ఎంపిక చేసింది.
గాయం కారణంగా స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్, స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఇద్దరూ దూరమవ్వడంతో వారి స్థానంలో యువ క్రికెటర్లు నూర్ అహ్మద్, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ స్టార్ ఓపెనర్ సెడిఖుల్లా అటల్‌లు జట్టులోకి వచ్చారు. చీలమండ గాయం శస్త్రచికిత్స అనంతరం ఇబ్రహీం జద్రాన్ కోలుకుంటున్నట్లు ఏసీబీ చీఫ్ సెలెక్టర్ అహ్మద్ షా సులిమంఖిల్ తెలిపాడు. ఇక 23 ఏళ్ల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ స్టార్‌కి జట్టులో చోటివ్వడంపై కూడా స్పందించాడు.
మంచి బ్యాటర్ కనిపిస్తున్నాడు..
సెడిఖుల్లా అటల్‌లో ఒక మంచి టాప్-ఆర్డర్ బ్యాటర్ కనిపిస్తున్నట్లు ఏసీబీ చీఫ్ సెలెక్టర్ వెల్లడించాడు. అతను స్థిరంగా రాణిస్తున్న తీరు.. భారీ స్కోర్లు చేయగల సామర్థ్యం అందరినీ ఆకట్టుకున్నాయని ప్రసంశించారు.
వన్డే సిరీస్ షెడ్యూల్:
- మొదటి వన్డే: నవంబరు 6
- రెండో వన్డే: నవంబర్ 9
- మూడో వన్డే: నవంబర్ 11
(మ్యాచ్‌లన్నీ షార్జా వేదికగా జరగనున్నాయి)
ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీబ్, గుల్బాద్దీన్ నబీబ్, ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, గజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూకీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
ALSO READ | BAN vs RSA: మెహిదీ అసమాన పోరాటం.. WTC ఎలైట్ లిస్టులో చోటు