ఏసీబీకి చిక్కిన ధారూర్​ ఎస్ఐ వేణుగోపాల్​ గౌడ్

ఏసీబీకి చిక్కిన ధారూర్​ ఎస్ఐ వేణుగోపాల్​ గౌడ్

వికారాబాద్​, వెలుగు:  ఓ కేసు విషయంలో   డ్రైవర్​ ద్వారా లంచం తీసుకున్న ధారూర్​ ఎస్​ఐ వేణుగోపాల్​గౌడ్​ ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఒక  కేసులో నాగసముందర్ ​గ్రామానికి చెందిన ఒకరి పేరు తొలగించడానికి వేణు రూ. 30 వేలు డిమాండ్​చేశాడు. 

ఇందులో భాగంగా మంగళవారం ఎస్​ఐ  డ్రైవర్​ బీరప్ప రూ.30 వేలు  తీసుకుంటుండగా ఏసీబీ    రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంది. అతడి సమాచారం మేరకు ఎస్​ఐ వేణుగోపాల్​ ను అరెస్ట్​ చేశారు. ఇద్దరినీ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని  ఏసీబీ అధికారులు తెలిపారు.