సీనియర్ అసిస్టెంట్‌‌పై ఏసీబీ కేసు

నకిరేకల్,  వెలుగు: వ్యవసాయ భూమిని పట్టాదారు పాసుబుక్కులో నమోదు చేసేందుకు లంచం అడిగిన నకిరేకల్‌‌ తహసీల్దార్‌‌‌‌ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌‌పై ఏసీబీ కేసు నమోదైంది.  వివరాల్లో వెళ్తే..  మండలంలోని పాలెం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన వెంకటేశం కుటుంబానికి  సర్వేనెంబర్ 15/2 లో ఉన్న రెండెకరాల భూమి మిస్సింగ్‌‌లో పడింది. దీన్ని తన తండ్రి పేరుపై ఉన్న పట్టా పాస్ బుక్ లో నమోదు చేయాలని వెంకటేశం గత నెల 20న  సీనియర్ అసిస్టెంట్ వద్దకు వెళ్లాడు.  

ఆయన రూ .65 వేలు లంచం డిమాండ్ చేయడంతో నల్గొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  దీంతో వాళ్లు శనివారం మధ్యాహ్నం సీనియర్ అసిస్టెంట్ పై విచారణ జరిపారు. నిజమేనని తేలడంతో రికార్డులు సీజ్ చేసి సీనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ రామకృష్ణ తెలిపారు.